Homemade Gulab Jamun Recipe – దీపావళి పండుగకు రుచికరమైన స్వీట్
Diwali దీపావళి పండుగ అంటేనే దీపాల వరుస! ఇది చీకటి మీద వెలుగు సాధించిన విజయానికి గుర్తు. ఈ పండుగని అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకుని, లక్ష్మీదేవిని పూజించి, టపాసులు కాలుస్తారు. స్వీట్లు తింటూ, బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దీపావళి అంటేనే ఒక ప్రత్యేకమైన పండుగ.
ఈ పండగ రోజు కొన్ని ప్రత్యేకమైన స్వీట్లు చేసుకొని ఇంట్లో సంతోషంగా అందరూ కలిసి తింటారు. దాంట్లో మనకు తెలిసిని చాలా వరకు ఉన్నాయి ఉదాహరణకి లడ్డు కాజా జాంగ్రీ జిలేబి పాయసం మైసూర్ పాకు మరియు గులాబ్ జాము ఇలా అనేక రకమైన స్వీట్లను తయారు చేసుకొని పండుగని ఆనందంగా జరుపుకుంటారు. ఇలా కొన్ని రకమైన స్వీట్లు మనం ఎలా తయారు చేస్తారో చూద్దాం.
గులాబ్ జామున్ కి ముందుగా కావాల్సిన పదార్థాలు:
- • మైదా: ఒక కప్పు
- • మిల్క్ పౌడర్: అరకప్పు
- • సాల్ట్ :హాఫ్ టేబుల్ స్పూన్
- • పంచదార: ఒకటిన్నర కప్పు
- • యాలుకల పొడి: ఒక టేబుల్ స్పూన్
- • నిమ్మకాయ: అర చెక్క
- • నూనె: డీప్ ఫ్రై సరిపడంతా
- • బేకింగ్ పౌడర్: వన్ టేబుల్ స్పూన్
- • పాలు: సరిపడంత
- • నెయ్యి: ఒక రెండు టేబుల్ స్పూన్
గులాబ్ జామున్ తయారీ విధానం:
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం తీసుకున్న మైదా మరియు మిల్క్ పౌడర్ రెండూ కలిసేటట్టు జాలించి మిక్స్ చేసి పెట్టుకోవా.
మనం మైదాలో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి చపాతీ పిండి లాగా కాస్తాన్ని గోరువెచ్చని పాలు వేసి మెత్తగా కలుపుకోవాలి. పాలను ముందుగానే వేడి చేసుకుని పక్కన పెట్టుకొని ఉండాలి. కలిపేటప్పుడు పాలని వాడటం వల్ల గులాబ్ జామున్ అనేది చాలా మెత్తగా మరియు టేస్టీగా వస్తుంది.
మనం తీసుకున్న గులాబ్ జామున్ మిక్స్ అనేది చాలా మెత్తగా కలుపుకోవాలి అంటే మనకు చపాతి ఒత్తుకునే పిండిలాగా మెత్తగా ఉండాలి.
Gulab Jamun for Diwali Festival
ఇప్పుడు చేతికి కాస్తంత నెయ్యి రాసుకొని మనం తీసుకున్న ఉండాలి చిన్న చిన్న బౌల్స్గా గులాబ్ జాములు షేపులో అన్ని కనపడేటట్లు నీటుగా రోల్ చేసుకుని పెట్టుకోవాలి.
ఒకపక్క బాండీలో డీప్ ఫ్రై కి సరిపడంతో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం చేసుకున్న చిన్న చిన్న బాల్స్ ని ఆయిల్లో వేసి బాగా మంచి బ్రౌనిష్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
మరో పక్క మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. షుగర్ సిరప్ కోసం ఒక కప్పు వాటర్ ఒక కప్పు షుగర్ తీసుకుందాము. షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. షుగర్ అండ్ షుగర్ అనేది కరిగేంతవరకు వేడి చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఉండదు.
ఇప్పుడు షుగర్ సిరప్ లోకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలుకల పొడి వేసుకోవాలి. యాలుకల పొడి వేసిన తర్వాత అందులో అర చెక్క నిమ్మరసం పిండటం వల్ల షుగర్ సిరప్ అనేది గట్టిపడకుండా ఉంటుంది.
ఇప్పుడు షుగర్ పాకం రెడీ అయిపోయింది కాబట్టి మనం చల్లారనిచ్చుకోవాలి. గులాబ్ జామూలు అనేది డైరెక్ట్ గా మనం ఆయిల్ లో నుంచి తీసి వెంటనే సిరప్ లో వేయకూడదు. గులాబ్ జాముల అనేది కాస్తంత చల్లారి దాని తర్వాత మనం షుగర్ సిరప్ లో వేసుకొని. ఒక అరగంట పాటు నాన్న నేర్చుకోవాలి. అప్పుడే మన షుగర్ సిరప్ అనేది గులాబ్ జాములకి బాగా పడుతుంది.అప్పుడే మనం తినేటప్పుడు జూసీ జూసీగా టేస్టీగా స్వీట్ గా ఉంటుంది.
అంతే మన దీపావళి కావాల్సిన టేస్టీ అయిన యమ్మి అయినా గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్లే మన పండక్కి చాలా ఆనందకరంగా కడుపునిండా తినే విధంగా ఈజీగా తయారు.
